ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని మదన పెడుతున్న కామన్ సమస్యల్లో హెయిర్ ఫాల్ అనేది ముందు వరసలో ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.
పౌష్టికాహార లోపం, ఒత్తిడి, డిప్రెషన్, హార్మోన్ల అసమతుల్యత, హెయిర్ డై, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వినియోగించడం వంటి రకరకాల కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తూ ఉంటుంది.అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో ఈ సమస్య మరింత అధికం అవుతుంది.
దాంతో హెయిర్ ఫాల్‌కు అడ్డు కట్ట వేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
కొందరైతే మందులు కూడా వాడతారు.
కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో మిగిలిపోయిన రైస్‌తో సులభంగా హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మిగిలిన అన్నంతో జుట్టు రాలడాన్ని ఎలా ఆపొచ్చో తెలుసుకుందాం పదండీ.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల రైస్, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి పల్చటి వస్త్రం సాయంతో రైస్ మిల్క్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సపరేట్ చేసి పెట్టుకున్న రైస్ మిల్క్, అర కప్పు కోకనట్ మిల్క్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.