విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ( Eklavya Model Residential School )విద్యాలయంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ( Collector Sandeep Kumar Jha )ఆదేశించారు.

 Collector Sandeep Kumar Jha Should Provide All Facilities To The Students ,ekla-TeluguStop.com

మంగళవారం కోనరావుపేట మండలం( Konaraopet ) మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యాలయ ఆవరణ, తరగతి గదులు, కిచెన్, తదితర వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

బాలుర, బాలికల డార్మీటరి , తరగతి గదుల్లో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.భోజన సదుపాయం, తరగతులు ఎలా బోధిస్తున్నారు అనే వివరాలను ఆరా తీశారు.

టాయిలెట్లు తక్కువగా ఉన్నాయని వెంటనే రెండు టాయిలెట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎంపీడీఓను ఆదేశించారు.గ్రామం నుండి విద్యాలయం వరకు రోడ్ సరిగా లేదని రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు తరగతులు బోధిస్తున్న తీరును పరిశీలించారు.అన్ని సబ్జెక్టులలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా పాఠాలు బోధించాలని ఆదేశించారు.

ఇక్కడ జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తదితరులు ఉన్నారు.తదనంతరం నిమ్మపల్లి గ్రామంలో చేపడుతున్న బ్రిడ్జి మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube