పోషణలోపంతో జిల్లాలో ఏ ఒక్కరూ బాధపడొద్దు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒక్కరూ కూడా పోషణ లోపంతో బాధపడకూడదని, పోషణ లోపంతో బాధపడేవారికి పోషకాహారం, వైద్య సేవలు అందించాలని, అత్యవసరమైతే నేరుగా నాకు ఫోన్ చేయాలని అంగన్వాడీ సూపర్ వైజర్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.పోషణమాసంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల( Anganwadi Centers ) ద్వారా అందిస్తున్న సేవల తీరుపై జిల్లాలోని అంగన్వాడీ సూపర్ వైజర్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

 District Collector Sandeep Kumar Jha Said That No One Should Suffer Due To Malnu-TeluguStop.com

అంగన్వాడీ కేంద్రాల పరిధిలో అందిస్తున్న సేవల గురించి సూపర్ వైజర్లను అడిగి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రతీ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ లు, సూపర్ వైజర్లు తప్పకుండా సందర్శించి, పర్యవేక్షించాలని ఆదేశించారు.

గర్భిణీ స్త్రీలు, హై రిస్క్ కేసులను గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడేలా పౌష్ఠికాహారంతో పాటు, మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.క్షేత్ర స్థాయిలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే నాకు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తన ఫోన్ నెంబర్ ను అంగన్వాడీ సూపర్ వైజర్లకు ఇచ్చారు.

అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, ఆశా లు తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి, వారి ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు.ఈ శనివారం ఎనీమియా గురించి టెస్ట్, ట్రీట్,టాక్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ లోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, మెటర్నల్ డెత్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ, మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు.సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి పి.లక్ష్మీరాజం, సీడీపీఓ లు సౌందర్య, సబిత, ఏసీడీపీఓ లు సుచరిత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube