బంగారు చీర..సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు.పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ 200 గ్రాముల బంగారం తో చీర తయారు చేశాడు.

 The Gold Saree Is A Masterpiece Of Handloom Artist Sirisilla , Sirisilla , Gol-TeluguStop.com

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురి వివాహ కోసం ఈ ఆర్డర్ ను ఆరు నెలల క్రితం తీసుకున్నాడు.బంగారాన్ని జరిపోవులుగా చేసి సరికొత్త డిజైన్ తో సుమారు 10 నుంచి 12 రోజులు కష్టపడి ఈ చీరను రూపొందించాడు.

చీర వెడల్పు 49 ఇంచులు, పొడవు ఐదున్నర మీటర్లు, బరువు 800 నుంచి 900 గ్రాముల లోపల ఉండేలా నేశాడు.వచ్చే నెల 17న వ్యాపారవేత్త కూతురి పెళ్లి వివాహ కోసం నేసినట్లు, చీర తయారీకి రూ.18 లక్షలు వెచ్చించినట్లు చేనేత కళాకారుడు నల్ల విజయ్ తెలిపాడు.చీర నేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, తనలోని కలను మరోసారి చూపినందుకు ఎంతో గర్వ కారణంగా ఉందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube