స్వచ్ఛ భారత్ లో యువత ముందుండాలి జిల్లా స్వచ్ఛభారత్ అధికారి సురేష్ వెల్లడి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభలో జిల్లా స్వచ్ఛభారత్ అధికారి సురేష్ బుధవారం మాట్లాడుతూ యువత గ్రామంలోని శుభ్రతకు సహకరించాలన్నారు.మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్తయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలో సురేష్ మాట్లాడుతూ జిల్లాలో నారాయణపూర్ గ్రామం ఇంకా మద్యపాన నిషేధిత గ్రామంగా ఉండడం సంతోషకరమన్నారు.

 District Swachh Bharat Officer Suresh Revealed That Youth Should Be In The Lead-TeluguStop.com

యువత ముందుకు వస్తే మిగిలిపోయిన మరుగుదొడ్లు ఇంకుడు గుంతల నిర్మాణాలకు సహకరిస్తానన్నారు.అంతేకాకుండా యువత ముందుకు వస్తే అభివృద్ధి పనులకు కూడా స్వచ్ఛభారతిలో నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

నారాయణపూర్ గ్రామానికి చెందిన షేక్ సబేర బేగం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నియామకమైనందుకు శాలువాలతో గ్రామస్తులు అధికారులు సన్మానించారు.అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ బురుక గోపాల్, గ్రామపంచాయతీ కార్యదర్శి జాఫర్,మాజీ సర్పంచులు దొమ్మాటి నర్సయ్య,నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ మహేందర్ నాయకులు మల్లారెడ్డి, మంతుర్తి శ్రీనివాస్,దొమ్మాటి రాజు, గ్రామస్తులు,యువకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube