నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న మండల తహశీల్దార్ జయంత్ కుమార్ ,రెవెన్యూ డివిజనల్(Jayant Kumar, Revenue Divisional) అధికారి ఉత్తర్వుల ప్రకారం, సీనియర్ సిటిజన్ చట్టం, 2007 నిర్వహణ మరియు సంక్షేమం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులో నిర్మించిన కెసిఆర్(KCR) రెండు పడక గధుల సముదయం లో గల ఆడువాలా రాజమల్లు కు ఇద్దరు కుమారులు కాగా ఇద్దరు కుమారులు కుడా
తన తండ్రి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి, అమానవీయంగా ప్రవర్తించిన, కనీస అవసరాలు తీర్చే బాధ్యతను కూడా పట్టించుకోకుండా ఉన్నందున ఇద్దరు కుమారులను విచారణ చేయగా రెండవ కుమారుడు ఆడువాలా సురేష్ (Aduvala Suresh)పొరపాటు జరిగినది అని తన తండ్రి నీ జాగ్రత్త గా చూసుకుంటానని అధికారుల సమక్షంలో చెప్పడం జరిగింది.కానీ పెద్ద కుమారుడు అయినా ఆడువాలా అనిల్ కుమార్(Aduvala Anil Kumar) మాత్రం ఎన్ని సార్లు నోటీసు పంపిన స్పందించక పోవడం తో తనకు కేటాయించిన 2bhk ప్లాట్ నెం.23ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జరిచేయడం జరిగింది.తదుపరి 7 రోజులలోగా ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించింది.ఆ తదుపరి తండ్రి అయినా అడువాలా రాజమల్లు పేరు మీద అట్టి ఇల్లును మంజూరి పత్రాలను కేటాయిస్తామని తెలిపారు.