రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల రక్షణ కొరకే షీ టీం ఉన్నదని,విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
మహిళల భద్రత,ఆకతాయిల వేధింపుల నుండి రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు షి టీమ్స్ ఏర్పాటు ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందన్నారు .
జిల్లాలో విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను గుర్తించి 42 కేసులు నమోదు చేయడం జరిగిందని, కొంత మందిపై 52 పెట్టి కేసులు నమోదు చేస్తూ, మరికొందరికి వారి కుటుంబీకుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు.
మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని,ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
షీ టీమ్స్ బృందాలు ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/మహిళ రక్షణ/సైబర్ నెరలపై అవగాహన కల్పిస్తునే ఆకతాయిల పై నిరంతరం షి టీమ్ బృందాలు మఫ్టీలో పర్యవేక్షణ చేస్తున్నాయని, మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు 87126 56425 సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది ప్రమీల, వీరయ్య, ప్రియాంక, రవలి, పాల్గొన్నారు.