మనలో చాలా మందికి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.మొటిమలు, పిగ్మెంటేషన్, వృద్ధాప్యం, కాలుష్యం తదితర అంశాలు ఈ మచ్చలకు కారణం అవుతుంటాయి.
ఏదేమైనా నల్లటి మచ్చలు( Black spots ) చాలా అసహ్యంగా కనిపిస్తాయి.ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.
ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడం కోసం ఖరీదైన క్రీములు వాడుతుంటారు.కానీ ఖరీదైన క్రీములు కన్నా పవర్ ఫుల్ గా పనిచేసే రెమెడీ ఒకటి ఉంది.
ఈ రెమెడీతో నల్లటి మచ్చలకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న టమాటో( Tomato ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు శెనగ పిండి( Besan flour ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ) , చిటికెడు కుంకుమపువ్వు, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) , వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.
ఈ సింపుల్ రెమెడీ చర్మంపై ఎలాంటి మచ్చలనైనా క్రమంగా మాయం చేస్తుంది.క్లియర్ స్కిన్ ను అందిస్తుంది.

అలాగే ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై మృత కణాలు పేరుకుపోకుండా ఉంటాయి.ఆయిలీ స్కిన్ తో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల చర్మం పై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
మొటిమలకు దూరంగా ఉండవచ్చు.మరియు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సైతం తొలగిపోతాయి.