ముఖంపై నల్లటి మచ్చలు అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఖరీదైన క్రీములు కన్నా పవర్ ఫుల్ గా పనిచేసే రెమెడీ మీకోసం!
TeluguStop.com
మనలో చాలా మందికి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.మొటిమలు, పిగ్మెంటేషన్, వృద్ధాప్యం, కాలుష్యం తదితర అంశాలు ఈ మచ్చలకు కారణం అవుతుంటాయి.
ఏదేమైనా నల్లటి మచ్చలు( Black Spots ) చాలా అసహ్యంగా కనిపిస్తాయి.
ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడం కోసం ఖరీదైన క్రీములు వాడుతుంటారు.
కానీ ఖరీదైన క్రీములు కన్నా పవర్ ఫుల్ గా పనిచేసే రెమెడీ ఒకటి ఉంది.
ఈ రెమెడీతో నల్లటి మచ్చలకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న టమాటో( Tomato ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు శెనగ పిండి( Besan Flour ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) , చిటికెడు కుంకుమపువ్వు, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) , వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి.
20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ సింపుల్ రెమెడీ చర్మంపై ఎలాంటి మచ్చలనైనా క్రమంగా మాయం చేస్తుంది.
క్లియర్ స్కిన్ ను అందిస్తుంది. """/" /
అలాగే ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మంపై మృత కణాలు పేరుకుపోకుండా ఉంటాయి.ఆయిలీ స్కిన్ తో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల చర్మం పై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
మొటిమలకు దూరంగా ఉండవచ్చు.మరియు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సైతం తొలగిపోతాయి.