40లోనూ య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకుంటే ఇలా చేయండి!

Do This If You Want To Look Youthful Even At 40 Years Old Details! Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Latest News, Dry Jasmine Flowers, Flax Seeds, Young Look, Flowers, Olive Oil, Aloevera Gel,

వ‌య‌సు పెరిగినా అందంగా, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌న్న కోరిక అంద‌రికీ ఉంటుంది.ముఖ్యంగా ఆడ‌వారు 40లోనూ ఇర‌వైలా మెరిసిపోవాల‌ని తెగ తాప‌త్రాయ ప‌డుతుంటారు.

 Do This If You Want To Look Youthful Even At 40 Years Old Details! Skin Care, Sk-TeluguStop.com

అందుకోసం చ‌ర్మంపై ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

స్కిన్ కోసం ఖ‌రీదైన క్రీమ్స్‌, సీర‌మ్స్‌, లోష‌న్స్ కొనుగోలు చేసి వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే వ‌య‌సు పెరిగినా అందాన్ని కాపాడుకోవ‌చ్చు.య‌వ్వ‌నంగా మెరిసిపోనూవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో గుప్పెడు ఎండిన మ‌ల్లె పూలు, వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేస్తే జెల్లీ ఫామ్‌లోకి మారుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్‌లో వ‌న్ టేబుల్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Aloevera Gel, Tips, Dryjasmine, Flax Seeds, Flowers, Latest, Olive Oil, S

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే.వారం రోజుల పాటు యూస్ చేయ‌వ‌చ్చు.

దీనిని ఎలా ఉప‌యోగించాలంటే.మొద‌ట‌ ముఖాన్ని వాట‌ర్‌తో ఒక‌సారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి రెండంటే రెండు నిమిషాల పాటు స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తే ఏజింగ్ ఆల‌స్యం అవుతుంది.మ‌రియు యుఖం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube