అత్యంత ఖరీదైన ఇల్లు: ఆ ఇంటి ఒక నెల అద్దెతో ఒక చిన్నపాటి గ్రామాన్ని నిర్మించవచ్చు?

సొంత ఇంటి కల అనేది ఓ సగటు పేదవాడి కల.కానీ అది కొందరి విషయంలో కలలుగానే మిగిలిపోతుంది.

 Most Expensive House: Can That House Build A Small Village With A Month's Rent H-TeluguStop.com

పెరిగిపోతున్న కాస్ట్ అఫ్ లివింగ్ వారికి పెను భారంగా మారుతున్న వేళ కొందరు బడాబాబులు మాత్రం కోట్లు వెచ్చించి మరీ నిర్మాణాలను చేపడుతూ వుంటారు.అంతవరకూ ఓకే.కానీ ఇక్కడ కధ వింటే బిత్తరపోవాల్సిందే.ఎందుకంటే ఇక్కడ ఓ ఇంటిలో నెల రోజుల అద్దె కోసం వారు కోట్ల రూపాయిలు వెచ్చిస్తారు.అవును… తాజా నివేదికల ప్రకారం, బ్రిటీష్ రాజ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా పేరుగాంచింది.ప్రస్తుతం ఈ ప్యాలెస్ గురించి ఒక స్టడీ బయటకు వచ్చింది.

మెక్‌కార్తీ స్టోన్ అధ్యయనం ప్రకారం, ఈ ప్యాలెస్ లో మొత్తం 775 గదులు ఉంటాయి.బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను కొనుగోలు చేయాలంటే £1.3 బిలియన్లు (రూ.130 కోట్లు) ఉండాల్సిందే అట.ప్రాపర్టీ డెవలపర్‌ల అంచనాల ప్రకారం, బ్రిటన్ రాజకుటుంబాల మొత్తం విలువ 2022లో £3.7 బిలియన్లకు చేరుకుంటుంది.2019 నుంచి 46 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తెలిసింది.బ్రిటన్ రాయల్ ఎస్టేట్‌లలో ప్యాలెస్‌లు, లాడ్జీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.రాజకుటుంబం ఎప్పుడైనా బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను అద్దెకు తీసుకోవాలనుకుంటే, దాని అద్దె నెలకు 2.6 మిలియన్ పౌండ్లు( సుమారు రూ.27 కోట్లు)గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Telugu Latest-Latest News - Telugu

అధ్యయనం కోసం సమీక్షించిన ఆస్తులు ఏవీ అమ్మకానికి లేదా అద్దెకు అందుబాటులో లేవు.రాచరికపు ఆస్తి హౌస్ ఆఫ్ విండ్సర్ వ్యక్తిగత ఆస్తి కాదు.ఇది UK ఆస్తి, ఇది ట్రస్ట్ కింద నడుస్తుంది.

బ్రిటన్‌లో క్వీన్స్ ప్లాటినం జూబ్లీని జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ అధ్యయనం జరిగింది.ఇవి బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన అధికారిక నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడంపై చేసిన సర్వే ఆధారంగా తెలిసిన వివరాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube