పువ్వులలో ఎర్రగా ముద్దుగా కనిపించే పువ్వు మందార పువ్వు.ఈ పువ్వులు ఇష్టపడనివారంటూ అసలు ఉండరు.
ఈ పువ్వుని జడలో పెట్టుకోవడానికి అలాగే పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటారు.అయితే ఈ పువ్వు ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అలాగే ఇది ఒక ఆయుర్వేద ఔషధంలా పేర్కొనబడింది.ఈ పువ్వును రకరకాల సౌందర్య ఉత్పత్తిలో వాడుతూ ఉంటారు.
తలకు పెట్టుకునే నూనెలో, షాంపూలలో కూడా ఈ పువ్వును ఈ పువ్వు ఆకులను ఉపయోగిస్తారు.అయితే అందానికి సౌందర్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పువ్వు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.
అయితే మందారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే మందార పువ్వుల టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఎందుకంటే మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.యాంటీ ఫంగల్, ఆంటీ పారాసైటిక్ లక్షణాలు ఉన్నాయి.
అందుకే మందారం ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.
అలాగే మందారం పూల టీనీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
మందార పువ్వుల టీ మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది.మందార టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటాయి.
అలాగే బరువు కూడా సులభంగా తగ్గవచ్చు.అలాగే మందారం టీ లో అమైలేస్ ఎంజైమ్స్ ఉంటాయి.

దీంతో చక్కెర, స్టార్చ్ నియంత్రలో ఉంటుంది.ఈ విధంగా బరువును సులువుగా తగ్గవచ్చు.ఇక ఈ టీ జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.ఈ టీ ని తాగడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి.
ఎందుకంటే మందారంలో ఉండే ఖనిజాలు సమృద్ధిగా జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.







