నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలం నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది అన్న విషయం తెలిసిందే.ఎందుకంటే నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.ఇలా వరుసగా ఆరు విజయాలు నమోదు చేశాడు జూనియర్ ఎన్టీఆర్.2014లో దసరా కి వచ్చిన రభస సినిమా తప్ప మిగతా అన్ని కూడా సూపర్ హిట్ లతో దూసుకు పోతున్నాడు.ఇలా ఈ జనరేషన్ హీరోలలో ఏ హీరోకి లేనంతగా సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.
ఇలా సూపర్ హిట్ సినిమాలతో డబుల్ హాట్రిక్ కొట్టేసాడు జూనియర్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే.2017 లో వచ్చిన టెంపర్ సినిమా సూపర్ హిట్టయ్యింది.ఎన్టీఆర్ లోని అసలుసిసలైన నటుడిని ప్రేక్షకులకి పరిచయం చేసింది.2016 లో వచ్చిన నాన్నకు ప్రేమతో మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయం సాధించింది.2017 లో వచ్చిన జై లవకుశ ఎన్టీఆర్ నట విశ్వరూపం తో సూపర్ హిట్ అందుకుంది.2018 లో వచ్చిన అరవింద సమేత రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలు కూడా అదిరిపోయే విజయాలను సాధించాయి అని చెప్పాలి.
ఇలా వరుసగా 6 సినిమాలు హిట్ అయ్యాయ్.నేటి తరం హీరోలలో ఎవరికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.అంతేకాదు ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో మరో రికార్డు కూడా సాధించాడు నందమూరి తారక రాముడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాకు ఉత్తమ కథానాయకుడు అవార్డు దక్కించుకున్నాడు.2008లో వచ్చిన కంత్రి సినిమాకు కూడా ఉత్తమ కథానాయకుడు అవార్డుకు ఎంపికయ్యాడు.ఇక 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమాతో మరో హిట్ కొట్టి ఉత్తమ కథానాయకుడిగా ఎంపికయ్యాడు.2010లో వచ్చిన బృందావనం సినిమాకు కూడా ఉత్తమ కథానాయకుడు అవార్డు దక్కించుకోవడం గమనార్హం.ఇలా వరుసగా నాలుగు సినిమాలకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు తగ్గించు కోవడం అంటే ఏ హీరోకి సాధ్యం కాలేదు అని చెప్పండి.