రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)నీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు
ఈ సందర్భంగా ఎనిమిది, తొమ్మిది తరగతులు కొనసాగుతూ ఉండగా తరగతి గదుల్లోకి వెళ్లి ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు 8వ తరగతిలో ఇంగ్లీషు పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయురాలు బోధిస్తుండగా తరగతి గదిలో కలెక్టర్ కూర్చుండి పరిశీలించారు.పలువురు విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠ్యాంశాలు చదివించారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సోషల్ తదితర అంశాలపై పట్టు సాధించేలా ప్రతిరోజు చదివించడం రాయించడం చేయాలని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పావని కి సూచించారు.