రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం లారీలు ఎప్పటికప్పుడు దించుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.వేములవాడ మండలం మర్రిపల్లి లోని మారుతి, మణికంఠ, మహాలక్ష్మి రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశిలించినారు.

 Kheemya Naik Additional Collector Conducted A Surprise Inspection Of The Rice Mi-TeluguStop.com

ఈ సందర్భంగా మిల్లుల యజమానులతో మాట్లాడారు.

రైతులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.

జిల్లాలో ఐ.కే.పీ, మెప్మా, పీ.ఏ.సీ.ఎస్, డీ.సీ.ఎం.ఎస్.విభాగాల ఆద్వర్యంలో ఇప్పటికే 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.అదేవిధంగా సీ.సీ.ఐ.ఆద్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.వరి, పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని కేంద్రాలకు పంట ఉత్పత్తులను తరలించాలని సూచించారు.సరైన తేమ శాతంతో ధాన్యం, పత్తి తరలించి, మద్దతు ధర పొందాలని కోరారు.

మిల్లర్లు సహకరించి, ధాన్యం దించుకోవాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube