నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

చేతినిండా పని కల్పించేందుకు ముందుకు వెళుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి టెక్స్టైల్ పార్కు లో యజమానులతో సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా: నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.తంగళ్లపల్లి మండలం లోని బద్దేనపల్లి టెక్స్టైల్ పార్కు లో యజమానులతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Weavers Should Not Lose Heart , Cm Revanth Reddy, Collector Sandeep Kumar Jha-TeluguStop.com

ఈ సందర్భంగా విప్ టెక్స్టైల్ పార్కులో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎన్ని పరిశ్రమల్లో క్లాత్ ఉత్పత్తి అవుతుంది? ఎందరికి ఉపాధి కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.అనంతరం టెక్స్టైల్ పార్కులోని ఒక పరిశ్రమలో క్లాత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు.

అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.సిరిసిల్ల లోని నేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

కార్మికులకు ఉపాధి చేతి నిండా పని కల్పించడమే ద్యేయంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.ఈ క్రమంలో టెక్స్టైల్ పార్కులోని యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు.

నేత కార్మికుల సమస్య పై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతనే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.ఈ సందర్బంగా పలువురు యజమానులు మాట్లాడారు.

తమకు విద్యుత్ బిల్లులో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ఓసీ ఇప్పించాలని, కామన్ ఫెసిల్టేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తదితర అంశాలను విప్ దృష్టికి వారు తీసుకెళ్లారు.దీంతో విప్ స్పందిస్తూ ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళి చర్చిస్తామని స్పష్టం చేశారు.

నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, యజమానులకు సైతం బకాయిలు విడతల వారీగా విడుదల చేయిస్తున్నామని తెలిపారు.నేత కార్మికుల సమస్యలు, భవిషత్ కార్యాచరణ పై చరించేందుకు త్వరలో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు, యజమానులు, ఆసాములతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డీడీ వెంకట్రావు, ఏడీ సాగర్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube