ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి :: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District )లో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలనీ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు.మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.

 Government Schemes Should Be Widely Publicized At The Field Level, Government Sc-TeluguStop.com

రాంచందర్(V Ram Chander ) సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హల్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహజన్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు , రిసర్చ్ అధికారి డి.వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ, అభివృద్ధి, రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు.

అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.రెవెన్యూ శాఖ, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, , ఈ డి – ఎస్.సి కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు.ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రతి శాఖల వారీగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పాత్రికేయులతో జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాం చందర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశం పై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశామని, విదేశీ విద్య పథకం, గురుకుల పాఠశాలలో ఎస్సి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాల, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పై రివ్యూ చేసామని తెలిపారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సకాలంలో పరిష్కరించాలని, వీటిపై పార్లమెంట్ 2018 లో 18 ఏ సేక్షన్ కింద ఎస్సీలు అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు.అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుందని, దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు.గతంలో జరిగిన నేరెళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి నిష్పక్షపాత విచారణ మరోసారి నిర్వహించాలని సూచనలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ డి ఎస్ సి కార్పొరేషన్ వినోద్ సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు రమేష్ రాజేశ్వర్ తహసిల్దార్లు జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube