రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.

జిల్లాలో మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్,విత్ ఔట్ లైసెన్స్, నెంబర్ ప్లేట్,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ లపై స్పెషల్ డ్రైవ్.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 20 రోజులుగా మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా,నెంబర్ ప్లేట్ లేకుండా, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ లపై, నిబంధనలకు విరుద్ధంగా సైరైన్ ఉపయోగించే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైనర్ డ్రైవింగ్ కేసులు 414 , లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు 831, సేల్ ఫోన్ డ్రైవింగ్ 163 , నెంబర్ ప్లేట్ లేకుండా నడిపే వాహనాలను 558 గుర్తించి వాటికి నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని,మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 334 , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై 326 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

 Everyone Should Participate In The Prevention Of Road Accidents , Road Accidents-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనాల తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయడం మా ముఖ్య ఉద్దేశ్యం కాదని కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమని, ప్రతి ఒక్కరు క్షేమంగా గమ్య స్థానాలు చేరుకోవాలనే ఉద్దేశ్యంతో తనిఖీలు చేపట్టాడాం జరుగుతుందని కావున ప్రజలు రోడ్ , ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్ ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.రోడ్డు,ట్రాఫిక్ నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించవద్దని తల్లిదండ్రులకు,వాహనాల యజమానులకు సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం అని నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.వాహనాదారులు ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని లైసెన్స్ లేనియెడల ప్రమాదాలు జరిగిన సందర్భంల్లో వర్తించే ప్రమాద భిమాలు వర్తించయని అన్నారు.

ప్రతి వాహనదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవడం వలన దొంగ వాహనాలను గుర్తించవచ్చని అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube