సీ.ఎం.ఆర్. లక్ష్యం సకాలంలో పూర్తి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సీ.ఎం.

 Cmr Target Should Be Completed On Time, Cmr Target , Collector Sandeep Kumar Jha-TeluguStop.com

ఆర్.లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైస్ మిల్లులకు రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించి, వాటిపై సమీక్షించి సకాలం లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

రైస్ మిల్స్ లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయో గుర్తించాలని, నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.మిల్లర్లు సీఎంఆర్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోవాలని, సరైన ప్రణాళిక రూపొందించి సకాలం లో లక్ష్యం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube