అసలే ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో ప్రధానంగా ఇబ్బంది పెట్టే జుట్టు సమస్యల్లో చుండ్రు ముందు వరసలో ఉంటుంది.
స్త్రీలే కాదు ఎందరో పురుషులు కూడా చుండ్రు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.మీరు చుండ్రు బాధితులేనా.? అయితే డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే రెండు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాలను వారంలో ఒక్కసారి పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా పరార్ అవ్వడం ఖాయం.
మరి చుండ్రును తరిమికొట్టే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు, నాలుగు లవంగాలు మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో బిర్యానీ ఆకు, లవంగాల పొడిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్‌ను స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక.
ఆ వాటర్‌ను తలకు మరియు జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకోవాలి.

ఇలా స్ప్రై చేసుకున్న గంట అనంతరం ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వేపాకు పొడి, రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఈ రెండు చిట్కాలను పాటిస్తే చుండ్రు క్రమంగా దూరం అవుతుంది.అదే సమయంలో హెయిర్ ఫాల్ సైతం అదుపులోకి వస్తుంది.