రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరికపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు,
జగిత్యాల ఎమ్మెల్యే గా రెండుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీపై విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్నితీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కొమ్ము బాలయ్య, గూడూరు భరత్, చెవుల మల్లేశం, నవాజ్, మెంగని మనోహర్, శీలం స్వామి శరయ్య, నవీన్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







