రాజన్న సిరిసిల్ల జిల్లా: కుక్కల దాడిలో మనుపోతు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అడవి నుండి బయటకు వచ్చిన మనుబోతును కుక్కలు వెంబడించి కరిచాయని, బెదిరిపోయిన అటవీ జంతువు గ్రామ సమీపంలోని సమ్మక్క గద్దెల వద్ద చెట్ల పొదలో ఇరుక్కుపోయింది.
ఇదే విషయాన్ని గ్రామస్తులు ఉదయాన్నే అటవీ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ ఆ సెక్షన్, బీట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు స్థానికంగా ఉండక పోవడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక దానిని రక్షించే ప్రయత్న మేమి చేయకపోవడం వల్లనే మనపోతు మృతి చెందిందని గ్రామస్తులు వాపోతున్నారు.