పూజ చేసేటప్పుడు గంట ఎందుకు మ్రోగిస్తారు.. గంటపై ఏ దేవుడి బొమ్మ ఉంటుందో తెలుసా..?

మన దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయాలకు ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

 Why Sound Bell During Puja Details, Bell, Pooja, Garuda Ganta, Temples , Haarath-TeluguStop.com

అలాగే భగవంతునికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే గంటలు లేని ఆలయం కచ్చితంగా ఉండదని చెప్పవచ్చు.

సనాతన ధర్మంలో గంట లేకుండా పూజ పూర్తి కాదు.గంట( Bell ) మోగించడానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.

గంట శబ్దం వాతావరణం లో సానుకూలతను తెస్తుంది.ఈ విషయం శాస్త్రీయంగా కూడా నిరూపించారు.సాధారణంగా హారతి ( Haarathi ) ఇచ్చేటప్పుడు హారతి తర్వాత ప్రజలు గంటను మోగించి తమ కోరికను దేవునికి తెలియజేస్తూ ఉంటారు.కానీ గంటపై ఏ దేవుని చిత్రం చెక్కబడి ఉంటుంది.

అందుకు గల కారణాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bell, Bell Sound, Bhakti, Devotional, Garuda, Garuda Ganta, Haarathi, Hin

సాధారణంగా చెప్పాలంటే పూజలో మోగించే గంటను గరుడ గంట( Garuda Ganta ) అని పిలుస్తారు.హిందూ మతం ప్రకారం ప్రపంచ సృష్టి జరిగినా శబ్దం ఈ గరుడ గంట నుంచి ఉద్భవించింది.అందుకే గరుడ గంటకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు.

అంతేకాకుండా పూజ లేదా హారతి సమయంలో గంట మోగించడం ద్వారా చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి దూరమవుతుందని చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే గృహాలు, దేవాలయాల పై భాగంలో గరుడ దేవుడి బొమ్మ ఉంటుంది.

Telugu Bell, Bell Sound, Bhakti, Devotional, Garuda, Garuda Ganta, Haarathi, Hin

హిందూమతంలో గరుడ దేవత, విష్ణు వివాహనంగా చెబుతారు.గరుడదేవుని చిత్రం గంటలో చెక్కబడి ఉండడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే అది విష్ణు వాహనం రూపంలో ఉన్న దేవునికి భక్తుల సందేశాన్ని తెలియజేస్తుందని ప్రజలను నమ్ముతూ ఉంటారు.అందుకే గరుడ గంటను మోగించడం ద్వారా విష్ణువుకు ప్రార్ధన చేరుతుంది అని ప్రజలు భావిస్తారు.అలాగే కోరికలు నెరవేరుతాయి అని కూడా నమ్ముతారు.అంతేకాకుండా గంటను మోగించడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube