పూజ చేసేటప్పుడు గంట ఎందుకు మ్రోగిస్తారు.. గంటపై ఏ దేవుడి బొమ్మ ఉంటుందో తెలుసా..?
TeluguStop.com
మన దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయాలకు ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.
అలాగే భగవంతునికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే గంటలు లేని ఆలయం కచ్చితంగా ఉండదని చెప్పవచ్చు.
సనాతన ధర్మంలో గంట లేకుండా పూజ పూర్తి కాదు.గంట( Bell ) మోగించడానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.
గంట శబ్దం వాతావరణం లో సానుకూలతను తెస్తుంది.ఈ విషయం శాస్త్రీయంగా కూడా నిరూపించారు.
సాధారణంగా హారతి ( Haarathi ) ఇచ్చేటప్పుడు హారతి తర్వాత ప్రజలు గంటను మోగించి తమ కోరికను దేవునికి తెలియజేస్తూ ఉంటారు.
కానీ గంటపై ఏ దేవుని చిత్రం చెక్కబడి ఉంటుంది.అందుకు గల కారణాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
సాధారణంగా చెప్పాలంటే పూజలో మోగించే గంటను గరుడ గంట( Garuda Ganta ) అని పిలుస్తారు.
హిందూ మతం ప్రకారం ప్రపంచ సృష్టి జరిగినా శబ్దం ఈ గరుడ గంట నుంచి ఉద్భవించింది.
అందుకే గరుడ గంటకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు.అంతేకాకుండా పూజ లేదా హారతి సమయంలో గంట మోగించడం ద్వారా చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి దూరమవుతుందని చెబుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే గృహాలు, దేవాలయాల పై భాగంలో గరుడ దేవుడి బొమ్మ ఉంటుంది.
"""/" /
హిందూమతంలో గరుడ దేవత, విష్ణు వివాహనంగా చెబుతారు.గరుడదేవుని చిత్రం గంటలో చెక్కబడి ఉండడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే అది విష్ణు వాహనం రూపంలో ఉన్న దేవునికి భక్తుల సందేశాన్ని తెలియజేస్తుందని ప్రజలను నమ్ముతూ ఉంటారు.
అందుకే గరుడ గంటను మోగించడం ద్వారా విష్ణువుకు ప్రార్ధన చేరుతుంది అని ప్రజలు భావిస్తారు.
అలాగే కోరికలు నెరవేరుతాయి అని కూడా నమ్ముతారు.అంతేకాకుండా గంటను మోగించడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు.
‘ఇది దేశమా? లేక చెత్త కుప్పా?’ భారత్‌ను అవమానించిన బ్రిటీష్ టూరిస్ట్!