హిందూ ధర్మం ప్రకారం( Indian Tradition ) పితృపక్షంలో పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పిండాన్ని సమర్పించి శ్రాద్ధం చేసే సంప్రదాయం చాలా శతాబ్దాల నుంచి ఉంది.అటువంటి పరిస్థితిలో చాలామంది పిండ ప్రధానం చేయడానికి వివిధ పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారు.
ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి గాయ అని దాదాపు చాలా మందికి తెలుసు.ఇక్కడికి వెళ్లి తమ పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తే అత్యంత ఫలవంతం నమ్ముతారు.
పూర్వీకులు మోక్షాన్ని పొందెందుకు పిండ ప్రదానం ఉత్తమ మార్గమని మత విశ్వాసం.బీహార్ లోనే ఫల్గు తీరంలో ఉన్న గయా జిల్లా( Gaya )లో పిండ ప్రధాననికి చాలా ప్రాముఖ్యత ఉందని ప్రజలను నమ్ముతారు.
హిందూ ఇతిహాసాల ప్రకారం తన తండ్రి దశరధుడి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీరాముడు కూడా గాయాలో పిండ ప్రధానం చేశాడని చెబుతూ ఉంటారు.
వాస్తవానికి పిండ ప్రధానం( Pinda Pradanam ) జరిగే గయాలో గతంలో 360 పేర్లతో పిండ ప్రధాన పీటలు ఉండేవని ప్రజలు చెబుతున్నారు.అయితే ఇప్పుడు వీటిలో 48 మాత్రమే మిగిలి ఉన్నాయి.ఈ పిఠాల్లో పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు.
ఇక్కడకు కొన్ని లక్షల మంది తమ పూర్వీకులకు పిండ ప్రధానం కోసం వస్తూ ఉంటారు.శాస్త్రోక్తంగా శ్రద్ధ కర్మలు ఇక్కడే చేస్తే పూర్వీకులకు స్వర్గం లభిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అలాగే శ్రీమహావిష్ణువు( Sri Maha Vishnu ) స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని చాలా మంది ప్రజల విశ్వాసం.ఇంకా చెప్పాలంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం బీహార్ లోని గయా జిల్లాను విష్ణు నగరమనికి కూడా అంటారు.దీనిని మోక్ష భూమి అని కూడా పిలుస్తారు.గరుడ పురాణం ప్రకారం శ్రద్ధ, కర్మ కోసం గాయాను చేరిన వ్యక్తి స్వర్గ నివాసాన్ని పొందుతాడు.ఇక్కడ శ్రాద్ధం చేయడం ద్వారా నేరుగా స్వర్గానికి వెళ్తారని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
LATEST NEWS - TELUGU