Mustard Oil : కురులకు అండగా ఆవ నూనె.. ఇలా వాడారంటే అద్భుత లాభాలు మీ సొంతం!

ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు( hair ) ఉత్పత్తులను వాడటం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించ‌డం తదితర కారణాల వల్ల రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.జుట్టు అధికంగా రాల‌డం, హెయిర్ గ్రోత్ లేకపోవడం, చుండ్రు, జుట్టు బలహీనంగా మారడం, కురులు తరచూ డ్రై అవ్వడం ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.

 Best Way To Use Mustard Oil For Healthy Hair-TeluguStop.com

వీటి నుంచి బయట పడాలి అంటే అంతా సులభం కాదు.కానీ ఆవనూనె అందుకు చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.

కురుల ఆరోగ్యానికి ఆవ నూనె ( Mustard oil )అండగా నిలుస్తుంది.మరి ఆవనూనె ప్రయోజనాలు ఏమిటి.? దాన్ని జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( curd ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Mudoil, Dandruff, Care, Care Tips, Fall, Healthy, Latest, Long, Thick-Tel

గంట అనంతరం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.ఇలా ఆవనూనెను వాడటం వల్ల అద్భుత లాభాలు మీ సొంతమవుతాయి.ఆవ నూనెలో విటమిన్ ఎ( Vitamin A ) ఉంటుంది.

ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే ఆవ నూనెలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి చుండ్రును నివారించి స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తాయి.

Telugu Mudoil, Dandruff, Care, Care Tips, Fall, Healthy, Latest, Long, Thick-Tel

ఆవ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) మరియు మినరల్స్ హెయిర్ ఫాల్ కు చెక్ పెడతాయి.అదే సమయంలో జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా అడ్డుకుంటాయి.కురులు త్వరగా తెల్ల బ‌డకుండా రక్షిస్తాయి.ఇక ఆవనూనె న్యాచురల్ కండిషనర్ లా పనిచేస్తుంది.పైన చెప్పిన విధంగా ఆవనూనెను వాడారంటే డ్రై హెయిర్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.కురులను సిల్కీగా మెరిపించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube