ఒకప్పుడు స్టార్లు సినిమాలో సంపాదించిన మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడే వారు.కానీ నేటి రోజుల్లో మాత్రం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.
కేవలం రియల్ ఎస్టేట్ లోనే కాదు అన్ని సెంటర్లలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అటు హీరోలు ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం.అంతేకాకుండా ప్రతి హీరో కూడా తమకు ఒక సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటే బాగుంటుందని ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుక్ ఖాన్ సినిమా లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
మరోవైపు యాడ్స్ తో పాటు పలు రకాల బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.రెడ్ చిల్లీస్ అనే ప్రొడక్షన్ హౌస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు ఐపీఎల్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు షారూఖ్.

ఇక బాలీవుడ్ గ్రీక్ బాడ్ గా పిలుచుకునే హృతిక్ రోషన్ ఫిట్ నెస్ స్టార్టప్ల పై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి ఇక అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారట.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అందరి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు అని చెప్పాలి.అంతకుమించి చారిటీ లో ఖర్చు పెట్టడమే కాదు ఆదాయాన్ని సంపాదించి ప్రొడక్షన్స్ తో పాటు పలు స్టార్టప్ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడా ఈ కండలవీరుడు.

మరో హీరో అమీర్ ఖాన్ కూడా తన సినిమాల ద్వారా యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు.అయితే ఇలా సంపాదించిన మొత్తాన్ని ప్రొడక్షన్ కంపెనీ తో పాటు ఆన్లైన్ ఫర్నిచర్ రెంటల్ ప్లాట్ ఫామ్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నాడట.పలు స్టార్టప్ కంపెనీల్లో కూడా అమీర్ఖాన్ కూ వాటాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది.