పెళ్ళికి రెడీ అంటున్న హాట్ బ్యూటీ.. ఇంత చిన్న ఏజ్ లోనే ఆ నిర్ణయమా?

తమిళ నటి బిగ్ బాస్ బ్యూటీ అయిన యాషిక ఆనంద్ గురించి అందరికీ తెలిసిందే.మొదట మోడల్ అయిన యాషిక ఆ తరువాత నటిగా కెరీర్ ను ప్రారంభించింది.

 Young Heroine Yashikaa Annand Ready To Marriage , Yashika Anand, Marriage, Socia-TeluguStop.com

మొదట ఈమె 2016లో దురువంగల్ పత్తినారు సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత చీకటి గదిలో చితక్కొట్టుడు, నోటా,అమ్మోరు తల్లి లాంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది యాషిక ఆనంద్.

ఈమె గత ఏడాది కారు ప్రమాదంలో గాయపడిన విషయం అందరికి తెలిసిందే.ఆ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.అయితే యాషిక ఆ ప్రమాదం నుంచి ప్రస్తుతం అసంపూర్ణంగా కోలుకొని అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.యాషిక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది.

ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది.అలా ఒక నెటిజన్ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకువచ్చాడు.పెళ్లి ఎప్పుడు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.నెటిజన్ అడిగిన ప్రశ్నకు యాషిక సమాధానమిస్తూ నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను.అందుకు నా తల్లిదండ్రులు కూడా అంగీకరించారు.జీవితంలో స్థిరపడేందుకు ఇది సరైన సమయం.

అయినప్పటికీ సినిమాలకు దూరం కాను.మనకు ప్రేమ అచ్చు బాటు కాదు కాబట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాను అందరి ఆశీస్సులు కావాలి అని యాషిక ఆనంద్ సమాధానం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube