ప్రస్తుత వింటర్ సీజన్ లో చాలా మంది ముఖ చర్మం డ్రై గా, డల్(Facial skin Dry dull ) గా మారిపోతుంటుంది.ఇటువంటి చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.
కానీ, వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే డ్రై గా, డల్ గా మారిన చర్మాన్ని ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు.
ఈ క్రీమ్ తో మళ్లీ మీ స్కిన్ మునుపటిలా మృదువుగా, కోమలంగా తయారవుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.
మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక కీరా దోసకాయ( ( Cucumber )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కీరా దోసకాయ అద్భుతంగా సహాయపడుతుంది.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు కీర దోసకాయజ్యూస్ ( Cucumber juice ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ మరియు మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.

రోజు ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు మరియు నైట్ నిద్రించడానికి ముందు ఈ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.ఈ క్రీమ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది.రోజుకు రెండుసార్లు ఈ క్రీమ్ ను వాడితే మీ చర్మం తేమగా, కోమలంగా మారుతుంది.
స్కిన్ స్మూత్ అవుతుంది.షైనీ గా మెరుస్తుంది.
ఈ వింటర్ సీజన్ లో డ్రై అండ్ డల్ స్కిన్ తో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.







