మనదేశంలో నిమ్మకాయలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.ఏదైనా కొత్త వస్తువు కొన్న, లేదా ఏదైనా పూజలో వంటలకు, లేదా ఆరోగ్యం కోసం, ఇలా చాలా వాటికి నిమ్మకాయను ప్రధానంగా భావిస్తారు.
నిమ్మకాయలకు ప్రతికూల శక్తులు ఉంటాయని అందరూ విశ్వసిస్తారు.అందుకే వాటిని ఇలాంటి సందర్భాల్లో విరివిగా వినియోగిస్తారు.
నిమ్మకాయల్లో ప్రతికూల శక్తులు, చెడు కల్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉందని చెబుతూ ఉంటారు.అందుకే దేవాలయాలలో పూజలు చేసే సమయంలో నిమ్మకాయలను ఉంచుతారు.
అలాగే అలా ఉంచిన నిమ్మకాయలను ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ ఎనర్జీలు దూరం అవుతాయని భావిస్తారు.అసలు నిమ్మకాయలకు ఎందుకు అంత ఆస్థానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం నిమ్మకాయ చరిత్ర వేదయ యుగం నాటిది.నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు( Lord shiva ) బ్రహ్మదేవుడు నుండి వరాలను పొంది శక్తివంతుడుగా మారతాడు.ఆ తర్వాత ప్రజలను వేధిస్తూ ఉంటాడు.అతడి క్రూరమైన పనులతో కలత చెందిన రిషి అగస్త్యుడు భూమిని ఆ రాక్షసుడి నుండి రక్షించాలని గొప్ప తపస్సు చేస్తాడు.
అతనిని అంతం చేయమని దుర్గా మాత( Durga Mata )ను ప్రార్థిస్తాడు.అందుకు అంగీకరించిన అమ్మవారు నింబాడురుడిని సంహరించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది.అందుకే అమ్మవారిని శాకంబరీ దేవి రూపంలో పూజిస్తూ ఉంటారు.ఇక ఆ దేవి మాత యొక్క దివ్య శక్తిని చూసి, తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని నింబాసురుడు వేడుకుంటాడు.

దీంతో అమ్మవారు అతడికి ఒక వరం ఇస్తుంది.ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడనీ ప్రకటిస్తుంది.అలా అప్పటినుండి ఈ నిమ్మకాయ హిందూ ఆచారాలలో ముఖ్యమైన భాగంగా మారింది.అంతేకాకుండా చండీమాత, కాళీమాత( Kalimatha 0 పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలను సమర్పిస్తారు.ఇలా నిమ్మకాయను వాడితే అమ్మవారికి కోపం తగ్గుతుంది.అందుకే ఇంట్లో పూజకు వాడిన నిమ్మకాయలను కూడా పారా వేయకూడదు.
ప్రసాదంగా వాడుకోవాలి.