విమానాశ్రయంలో శ్రీరాముడు కనిపిస్తే ఒక మహిళ చేసిన పని చూస్తే షాక్ అవుతారు....

ఈ మధ్యకాలంలో సీరియల్స్ నటించే వారికి కూడా ఫాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.వారు ఎక్కడికి వెళ్ళిన అభిమానులు వారితో సెల్ఫీల కోసం నిలబడుతూ ఉంటారు.80 వ దశకంలో వచ్చిన రామాయణ్‌ సీరియల్ బుల్లితెరపై కొత్త చరిత్రని సృష్టించింది.అప్పట్లో రామాయణ్‌ సీరియల్‌లో నటించిన శ్రీరాముడు, సీత, లక్ష్మణులను అభిమానులు నిజమైన దేవతామూర్తులుగా భావించి వారికి హారతులు ఇచ్చేవారు.

 If Sri Ram Is Seen At The Airport, He Will Be Shocked To See The Work Done By A-TeluguStop.com

ఈ సీరియల్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిందుకు అభిమానులలో ఆదరణ మాత్రం తగ్గలేదు.ఎయిర్‌పోర్ట్‌లో శ్రీరాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ పాదాల కు నమస్కరించింది.

తాజాగా రామాయణ్‌ సీరియల్‌ దేశమంతా ప్రభంజనం సృష్టించింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరోసారి రామాయణ్ సీరియల్‌ను బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు.

ఈ సీరియల్‌లో నటించిన పాత్రధారులందరికీ ఏ చోటకెళ్లినా జనం నీరాజనాలు పట్టారు.తాజాగా విమానాశ్రయం నుంచి కుటుంబసమేతంగా బయటకు వస్తున్న శ్రీరాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ను ఓ మహిళ చూసింది.

వెంటనే వెళ్లి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది.ఈ చేష్టతో అరుణ్‌ గోవిల్‌ నిర్ఘాంత పోయి కొద్ది సేపు మాటరాక మౌనంగా నిలబడిపోయాడు.

తేరుకుని తన వద్ద ఉన్న పసుపు రంగు దుపట్టాను ఆ మహిళ కు అందించి పులకించిపోయాడు.

గత నెల 30 వ తేదీన ఈ సంఘటన కు సంబంధించిన వీడియోను ఐఏఎస్‌ అధికారి డాక్టర్ సుమిత మిశ్రా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.రామాయణం టీవీ సీరియల్‌ వచ్చి 35 సంవత్సరాలు అవుతున్న, రాముడి పాత్రలో నటించిన అరుణ్‌ గోవిల్‌ మాత్రం ఇప్పటికీ అందరికీ శ్రీరాముడిగానే ఉన్నారు.ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది చూశారు.

కొంతమంది రామాయణం సీరియల్ లో నటించిన వారు వారి పాత్రలలో నటించలేదు జీవించారని కూడా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube