ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.58
సూర్యాస్తమయం: సాయంత్రం 05.53
రాహుకాలం: ఉ.07.52 నుంచి 10.12 వరకు
అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.12 వరకు
దుర్ముహూర్తం: మ.12.56 నుంచి 02.07 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.మీ ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఒక సంఘటన వల్ల మీకు రిలీఫ్ దొరుకుతుంది.
కొన్ని విషయాలకు అనుకూలంగా ఉంది.ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి
వృషభం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నా డబ్బులు పొదుపు చేయలేకపోతారు.మీ స్నేహితుల నుండి సలహాలు అందుతాయి.ఇతరులతో పోటీ ఉండడం వల్ల మీ పనిలో తీరిక లేకుండా ఉంటుంది.
వ్యాపార అభివృద్ధి కోసం వేసుకున్న ప్లాన్ లు ఫలిస్తాయి.ఈరోజు మీ జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు సమయానికి తగ్గట్టుగా పనిచేయడం లో ముందుంటారు.మీ స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపరు.ఈరోజు మీ భాగస్వామితో ఆర్థికపరంగా గొడవలు వస్తాయి.
కర్కాటకం:

ఈరోజు మిమ్మల్ని ఒకరు ఆర్థిక సహాయం అడుగుతారు.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.మీకు సంబంధించిన విషయాలను ఇతరులకు తెలియక పోవడం మంచిది.
కొత్త విషయాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు
సింహం:

ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఈరోజు ఒక వార్త సంతోషాన్నిస్తుంది.కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉండదు.పని చేసే చోట ఒకరు మిమ్మల్ని ద్రోహం చేస్తారు.
మీ వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతుంది.
కన్య:

ఈరోజు మీరు చాలా రోజులనుంచి బాధపడుతున్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు.మీరు అప్పులు చేసి వారికి ఇచ్చేటప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు.
దీంతో సంతోషంగా ఉంటారు.ఈరోజు మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
తులా:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.సమస్యల నుండి బయట పడతారు.దీనివల్ల ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.కలత కలిగించే సంఘటనలు అయోమయం గా ఉంటాయి.మీ జీవిత భాగస్వామితో సమయం ను కేటాయిస్తారు.
వృశ్చికం:

ఈరోజు డబ్బును అతిగా ఖర్చు చేయడం తోఆర్థిక పరంగా నష్టం ఎదురవుతుంది.అశ్రద్ధ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.మీకు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
ధనస్సు:

ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయం అందుకుంటారు.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.మీ జీవితంలో అన్నీ ఒకవైపు అయితే ప్రేమ మాత్రం జీవిత భాగస్వామి వైపు ఉంటుంది.ఇతరులతో మాట్లాడడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి.మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
మకరం:

ఈరోజు మీ డబ్బు విషయంలో మీ సంబంధాలు వదులుకోవద్దు.కొన్ని విషయాలు అదుపులో ఉంచుకొని వ్యాపారం గురించి ఆలోచన చేయండి.వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.
మీ ఆలోచనలు మీ బలహీనతను దూరం చేస్తుంది.మీ తెలివితేటలు మీకు ఉపయోగపడతాయి.వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త.
కుంభం:

ఈరోజు మీరు చేసే పనిలో మీరు అలసటను చూపించడం వల్ల ఆర్థికంగా నష్టం ఉంటుంది.మీరు పనిచేసే చోట వివాదాలు పెట్టుకోవద్దు.మీరు పనిచేసే చోట మీదే రాజ్యం.
ప్రశాంతత కోసం బయటకి వెళతారు.మీ జీవితభాగస్వామితో ఈరోజు అద్భుతంగా సాగనుంది.
మీనం:

ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి.ఇతరులతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.వైవాహిక జీవితంలో కొన్ని పరిణామాలు ఎదురవుతాయి.మీ భాగస్వామి మీకు ప్రేమను అందిస్తారు.