ఇండియా తరుపున ప్రపంచ అందాల పోటీలలో పాల్గొని మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు.ప్రియాంక చోప్రా తర్వాత మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మరో అందాల సుందరి మానుషీ చిల్లర్ ఈ భామ నటిగా తెరంగేట్రంతోనే పృథ్వీరాజ్ లాంటి అద్భుతమైన హిస్టారికల్ మూవీలో నటించే అవకాశం సొంతం చేసుకుంది.
ఇండియన్ వారియర్ పృథ్వీరాజ్ చౌహన్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
ఇందులో పృథ్వీరాజ్ సతీమణిగా మానుషీ చిల్లర్ కనిపించబోతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నటించడంపై హీరోయిన్ మానుషీ చిల్లర్ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో నటించడానికి కారణం దర్శకధీరుడు రాజమౌళియే అని చెప్పింది.చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ భారీ పీరియాడికల్ మూవీలో నటించడం ఎలా ఉందని మానుషిచిల్లర్‌ను అడిగితే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాను చూసి ఎంతో స్ఫూర్తి పొందానని, అలాంటి భారీ చిత్రంలో నటించాలని అనుకుంటున్న సమయంలో పృథ్వీరాజ్ సినిమాలో నటించే అవకాశం దక్కిందని తెలిపింది.
రాజమౌళి ఎన్నో ఐకానిక్ చిత్రాలను రూపొందించారని, తనకు వీలున్నప్పుడల్లా రాజమౌళి సినిమాలను చూస్తుంటానని, ఆయన సినిమాల్లో మహిళా పాత్రలు చాలా బలంగా ఉంటాయని చెప్పుకొచ్చింది.అందుకే సినిమాల విషయంలో రాజమౌళి తనకి ఇన్స్పిరేషన్ అని మానుషీ చిల్లర్ చెప్పుకొచ్చింది.
మొత్తానికి మానుషీ పృథీరాజ్ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ లో అందరిని ఆకర్షించింది.తన సినిమా ప్రయాణం కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది.
మరి ఆమె కంటే ముందు వచ్చిన మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా మాదిరి మానుషీ కూడా ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి.