సంతాన ప్రాప్తి కలగాలంటే గోమాతకు ఇవి పెట్టాల్సిందే..!

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాలలో గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.సకల దేవతలు గోమాతలో కొలువై ఉంటారని భావిస్తారు.

 If You Want Children Then You Have To Give These Foods To Holy Cow,  Pregnancy,-TeluguStop.com

ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న గోమాతకు పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తారు.సాధారణంగా మనం ఏదైనా దానం చేస్తే అందుకు తగ్గ ప్రతిఫలం మనకు దక్కుతుందని భావిస్తాము.

అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గోమాతకు వివిధ రకాల పదార్థాలను ఆహారంగా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు, కలహాలు వచ్చినప్పుడు గోమాతకు నానబెట్టిన పచ్చిశెనగపప్పును పెట్టడం వల్ల కుటుంబంలో కలతలు తొలగిపోతాయి.అదేవిధంగా తోటకూర, బెల్లం పెట్టడం వల్ల మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది.

అప్పుల బాధలో కూరుకుపోయిన వారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు పెట్టడం వల్ల రుణ విముక్తి కలుగుతుంది.బెండకాయలను గోమాతకు సమర్పించడంవల్ల మనోధైర్యం కలుగుతుంది.

నానబెట్టిన గోధుమలను పెడితే సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.నానబెట్టిన బొబ్బట్లు గోమాతకు పెట్టడం ద్వారా ధనాభివృద్ధి కలుగుతుంది.

ఉద్యోగం పొందాలనుకునేవారు గోమాతకు గోధుమ పిండి, బెల్లం సమర్పించి పూజించడంవల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

Telugu Foods, Gomata, Hindu, Jaggery, Peanuts, Pooja, Pregnancy, Problems Solved

ఎన్నిరోజులకు వివాహం కాని వారు దోష నివారణకు గోమాతకు టమోటాలను సమర్పించడం వల్ల కళ్యాణ ఘడియలు దగ్గర పడతాయి.శత్రు భయం ఉన్నవారు గోవుకు దోసకాయలను సమర్పించాలి. సంతానం లేనివారు గోమాతకు వంకాయలను సమర్పించి పూజించడంవల్ల సంతానప్రాప్తి కలుగుతుంది.

నరఘోషతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు గోవుకు బంగాళదుంపలను సమర్పించాలి.గోమాతకు మినప పిండి, బెల్లం సమర్పించడంవల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

ఈ విధంగా గోమాతకు ప్రతి శుక్రవారం శుభ్రంగా గోమాతను కడిగి, వివిధ రకాల ఆహార పదార్థాలను దానం చేసి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలగడమే కాకుండా ఎంతో పుణ్యఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube