ముఖ్యంగా చెప్పాలంటే చేతికి, పాదాలకు, నడుముకు, నల్లదారం( Black Thread ) చుట్టుకోవడం వెనుక బలమైన నమ్మకాలు ఉంటాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు రంగు శని గ్రహాన్ని సూచిస్తుంది.
పాదాలకు నలుపు ధారాన్ని ధరించిన వ్యక్తికి రక్షకుడిగా శని దేవుడు ఉంటాడని ప్రజలు నమ్ముతారు.నల్ల దారాన్ని దానికి తొమ్మిది ముళ్ళు వేసిన తర్వాతే కట్టుకోవాలి.
నలుపు దారం ధరించిన తర్వాత కాలికి మరో రంగు దారాన్ని కట్టకూడదు.నల్ల దారం ప్రభావం తీవ్రతరం చేయడం కోసం గాయత్రి మంత్రాన్ని( Gayatri Mantra ) చదివిన తర్వాతే దీన్ని కట్టుకోవాలి.
ఆ తర్వాత కూడా ప్రతి రోజు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.ప్రతిరోజు ఒకే సమయంలో గాయత్రి మంత్రాన్ని చదవాలి.
దారాన్ని ధరించిన వెంటనే గాయత్రి మంత్రాన్ని 22 సార్లు జపించాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం( Astrology ) మగవారు ఎప్పుడూ తమ కుడి కాలు లో నల్లటి దారం ధరించాలి.మంగళవారం లేదా శనివారం మాత్రమే నల్ల దారాన్ని ధరిస్తాలని గుర్తుపెట్టుకోవాలి.నల్ల దారం వల్ల చెడు దృష్టి నుంచి రక్షణ కూడా లభిస్తుంది.
ఇది మీ వైపు వచ్చే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని దూరం చేస్తుంది.చేతబడి ప్రభావాలు కూడా లేకుండా చేస్తుంది.
జాతకంలో బలహీనమైన రాహువు, కేతువులు ఉన్నవారు పాదాలకు నల్ల దారం కట్టుకుంటే ప్రతికూల ప్రవాహం నుంచి రక్షణను పొందవచ్చు.ముఖ్యంగా ఆలయాలలో పూజ చేసిన తర్వాత చేతికి కొందరు నల్లని దారాన్ని కట్టుకుంటూ ఉంటారు.
ఇలా రక్షా ధారాన్ని కట్టుకోవడంతో పూజ పరిపూర్ణం భావిస్తారు.హిందూమతంలో ఈ దారన్ని రక్షణ సూత్రంగా పరిగణిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే పాదాలకు నల్లదారం కట్టుకోవడం వల్ల జాతకంలో కుండలి దోషం( Kundali Dosham ) తొలగిపోతుందని ప్రజలు నమ్ముతారు.అదే సమయంలో నల్ల దారాన్ని కట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శనివారం నల్ల దారం కట్టడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.ఇది మరింత ప్రభావంతంగా ఉండడం కోసం రుద్ర గాయత్రి మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL