ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిలో మిన్నంటుతున్న కరోనా రోగుల ఆర్తనాదాలు.. ?

గత సంవత్సరం నుండి ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలు అంటూ ఏవీ లేవు.అన్నీ చేదు ఘటనలే మస్తిష్కం నిండా నిండిపోయాయి.

 Covid Patients Suffer In Tenali Govt Hospital, Tenali, Govt Hospital, Covid Pati-TeluguStop.com

ఆనందంగా సాగుతున్న బ్రతుకుల్లోకి కరోనా అనే రక్కసి చొరబడటంతో మనుషుల జీవన రేఖలు పూర్తిగా మారిపోయాయి.

ఇక దేశంలో ప్రస్తుత పరిస్దితులనైతే అంచన వేయడం కష్టంగా మారింది.

ఇదిలా ఉండగా తెలంగాణ తో పాటుగా ఏపీలో కూడా కరోనా వైరస్ ప్రమాద గంటలు మోగిస్తుంది.ఈ నేపధ్యంలో కేసుల నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదు.

అదీ గాక కోవిడ్ రోగులకు ఆక్సిజన్, వ్యాక్సినేషన్ అందించడంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.దీనికి తోడు వర్షాలు జతకట్టడంతో ఇక్కడి ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది.

ఇకపోతే గతరాత్రి కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీని కారణంగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రోగుల బాధలు వర్ణాతీతంగా మారాయి.

ప్రాణ వాయువు కోసం వీరు చేస్తున్న ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.ఇలా సుమారు గంట నుంచి ఇక్కడ పవర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్దితి నెలకొనడం బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube