తెలుగు సినీ ప్రేక్షకులకు నటి, నిర్మాత,దర్శకురాలు విజయనిర్మల( Vijaya Nirmala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు కూడా సంపాదించుకున్నారు.
అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు.అయితే 2019 జూన్‌లో విజయనిర్మల మూసిన విషయం తెలిసిందే.
భర్త సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) కూడా 2022లో మరణించారు.వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తాయి.
అయితే తాజాగా ఇదే విషయంపై విజయనిర్మల మనవడు నటుడు నవీన్( Actor Naveen ) స్పందించాడు.నరేష్( Naresh ) మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను కోరింది.
అందుకు సరిపడా వీలునామాను కూడా రాపించాలని నానమ్మ కోరింది.ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు.
అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను.కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాము.
ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు.

ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు.ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై( Vijaya Nirmala Property ) అంతగా నాకు అవగాహన లేదు.నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను అని చెప్పుకొచ్చారు నవీన్. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు ఉండదు కూడా.ఎందుకంటె అందులో ఒక్కరూపాయి నేను సంపాధించలేదు.నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే.

నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ.నా తమ్ముళ్లు రణ్‌వీర్, తేజ ఇద్దరూ నాకు ఇష్టమే.కానీ తేజ అంటే నాకు ప్రాణం.వాడంటే నాకు ఎనలేని ఇష్టం.నేనన్నా కూడా వాడికి అంతే.మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అని నవీన్ తెలిపాడు.
రణ్‌వీర్ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా తేజ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే.టాలీవుడ్‌లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు.







