మంత్రి రోజా( Roja ) పై మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు చెన్నై లోని తన నివాసం నుండి ప్రముఖ సినీ నటి కుష్బూ( Kushboo ) కండించారు.మహిళ మంత్రి పై బండారు వ్యాఖ్యలు భద్రతకు, దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
బండారు ఒక మనిషిగా విఫలమయ్యాడని, తక్షణమే మంత్రి రోజాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల సినీ నటి కుషుబు డిమాండ్ చేసారు.
మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రధాని మోడీ( Narendra Modi ) తెచ్చినా ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్ళు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.
మహిళలని గౌరవించే వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరని,మహిళలను దూషించడం బండారుకి జన్మ హక్కు అనుకుంటున్నాడా అన్నారు.దేశంలో మహిళ సాధికారత కోసంచర్చ జరుగుతున్న సమయంలో మహిళపై ఇంత అసభ్యకరంగా మాట్లాడతావాఅంటూ, క్షమాపణ చెప్పేంత వరకు మంత్రి రోజాతో కలిసి పోరాటం చేస్తానని సినీ నటి కుషుబు తెలిపారు
.