పార్టీ నేతలంతా యాక్టివ్ కావాలని, పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడాలని నియోజకవర్గం యాక్టివ్ గా ఉంటూ అధికార పార్టీని ధైర్యంగా ఎదుర్కొని టిడిపి సత్తా చాటాలని పదేపదే అధిష్టానం నుంచి నాయకులకు ఆదేశాలు వస్తున్నా, చాలా చోట్ల తెలుగు తమ్ముళ్ళు సైలెంట్ గా ఉండి పోతున్నారు.ఉద్యమాలు , ఆందోళనలు చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న పని అని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఖర్చు పెడితే రాబోయే ఎన్నికల్లో తమకు టిక్కెట్ ఖరారు కాకపోతే అప్పుడు ఖర్చు పెట్టినది అంతా వృధా అవుతుందనేది చాలా మంది నియోజకవర్గ స్థాయి నాయకుల అభిప్రాయం గా ఉందట.
ఇంకా రెండున్నరేళ్ల పాటు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం అంటే అది భారీగా ఉంటుందని, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం.అందుకే ప్రస్తుతం సైలెంట్ గా ఉంటూ సమయం దగ్గరకు వచ్చినప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ , ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుంది అనేది మెజార్టీ టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం టిడిపి తరఫున యాక్టివ్ గా పనిచేస్తున్న వారు గత టీడీపీ హయాంలో ఆర్థికంగా బలోపేతం అయిన వారికి ఏ ఇబ్బందులు ఉండవని, కానీ తమ పరిస్థితి అలా కాదని , ఇప్పుడు కోటాను కోట్లు పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెడితే ఎన్నికల నాటికి తమకు టికెట్ విషయంలో అవకాశం కల్పించకపోయినా, పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా, తమకు జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందనే లెక్కలో ఉన్నారట.

అందుకే పదేపదే యాక్టివ్ గా ఉండాలంటూ పార్టీ నాయకులకు పిలుపునిస్తున్నారు.మెజారిటీ నాయకులు సైలెంట్ గానే ఉండి పోతున్నారట.ఎన్నికలకు ముందు యాక్టివ్ అవడం ద్వారా, తాము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కి ఫలితం దక్కుతుంది అనే లెక్కల్లో చాలామంది టిడిపి నాయకులు ఉన్నారట.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడిపి నేత ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టడం, వారి వ్యాపారాలను దెబ్బతీయడం తదితర కారణాలతో మెజార్టీ టిడిపి నేతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.టిడిపి తరఫున యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం పై పదే పదే విమర్శలు చేసే టిడిపి నాయకులను టార్గెట్ గా చేసుకుని 2019 నుంచి చోటుచేసుకున్న పరిణామాలను టిడిపి నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడు యాక్టిివ్ అవ్వడం ద్వారా తమ ఆర్ధిక మూలాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సైలెంట్ గా ఉండటమే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్నారట.
.