అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, నిద్ర లేమి, స్మార్ట్ ఫోన్లు అతిగా చూడటం, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఐ మేకప్ ప్రోడెక్ట్స్‌ను వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాయి.ఈ డార్క్ సర్కిల్ చూసేందుకు ఆసహ్యంగా ఉండటమే కాదు.
అందాన్ని సైతం తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అందుకే డార్క్ సర్కిల్స్‌ను నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా డార్క్ సర్కిల్స్‌ను మటుమాయం చేసుకోవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.
ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే వేప పువ్వులు డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.అందు కోసం ముందుగా కొన్ని వేప పువ్వులను తీసుకుని మెత్తగా నూరి పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వేప పువ్వుల పేస్ట్‌లో పావు స్పూన్ కస్తూరి పసుపు, ఒక స్పూన్ వెనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ స్మూత్‌గా అప్లై చేసుకుని.
పది నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే గనుక కేవలం కొద్ది రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ తగ్గు ముఖం పడతాయి.

అలాగే నువ్వులను మెత్తగా పొడి చేసుకుని అందులో చిటికెడు పసుపు, పొట్ల కాయ పై పొట్టు మరియు పాల మీగడ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళల్లోకి వెళ్లకుండా మెల్ల మెల్లగా అప్లై చేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా తరచూ చేసినా కూడా నల్లటి వలయాల నుంచి విముక్తి లభిస్తుంది.పైగా ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాస్తే.అవి కూడా తగ్గిపోతాయి.