విమాన సిబ్బంది 'లోదుస్తులు' ధరించాలి... పాక్‌ ఎయిర్‌లైన్స్‌ని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు! 

సొంత దేశంలోనే పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ పరువు గంగలో కలిసిపోయింది.విమాన సిబ్బందికి డ్రెస్‌ కోడ్‌లో భాగంగా లోదుస్తులు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే దానికి గల కారణం.

 Pakistan Airlines Strange Dress Code To Wear Undergarments Details, Airport, Aer-TeluguStop.com

ఈ క్రమంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా.ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌.

గురువారం PIA క్యాబిన్‌ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది.యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది.

అంతేకాకుండా అలా వేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్‌ సేవలపై పేలవమైన ముద్ర పడిపోతుందని, తద్వారా గడ్డుపరిస్థితి ఎదురుకావొచ్చని ఎయిర్‌లైన్స్‌ ఆ ఆదేశాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అంటే లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

అదిగో అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.ఎయిర్‌లైన్స్‌ ఇచ్చింది అసలు అవసరం లేని ఆదేశాలన్నారు చాలామంది.

ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్‌ కూడా జరిగింది.దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్‌.

అయితే ఆ విమర్శలు మామూలుగా రాలేదు.అందుకే ఆ ఆదేశాలపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది PIA.

డ్రెస్‌ కోడ్‌కు సంబంధించిన ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతోనే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని PIA చీఫ్‌ HR ఆఫీసర్‌ రాతపూర్వక వివరణ ఇచ్చుకున్నారు.ఇక.జరిగిన ఘటనకు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం తెలియజేశారాయన.పీఐఏ పాక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్‌.

రోజూ వందకు పైగా విమానాలు నడిపిస్తోంది.అందులో 18 దేశీయ సర్వీసులు కాగా, 25 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube