నందమూరి తారక రామారావు.ఈ పేరు చెప్తే చాలు తెలుగు వాడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది.
సినిమాలు ఒక్కటే కాదు , అయన రాజకీయం జీవితం కూడా ఎందరికో ఆదర్శం.ఇక కేవలం నటుడిగానే కాదు నిర్మాత గాను, దర్శకుడిగానూ ఆయనకు ఆయనే సాటి.
సినిమాల్లో ప్రయోగాలు చేయడం కూడా అన్నగారి తర్వాతే ఎవ్వరైనా.సినిమాల్లోకి వచ్చిన మొదటి కొన్నేళ్లు దర్శకులకు, నిర్మాతలకు నచ్చిన నటుడిగా, తన పని తాను చేసుకుంటూ వెళ్లిన కూడా ఒక స్టేజ్ దాటాక ఆయనలోని నటుడిగా ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు.
ఇక ఎన్టీఆర్ నటిస్తున్న కాలంలో సైతం కెవి రెడ్డి, బివి రెడ్డి, విఠలాచార్య లాంటి దర్శకులు ప్రయోగాలతో సినిమా ఇండస్ట్రీ ని ఎన్నో రేట్లు పైకి లేపారు.
మద్రాసులో కెవి రెడ్డి అంటే ఎన్టీఆర్ ఎంతో ఇష్టం.
అయన బాటలోనే ఎన్టీఆర్ సైతం నడిచి అయన చేసిన ప్రయోగాలనే ఎన్టీఆర్ కూడా కొనసాగించారు.ఆలా ప్రయోగాలు చేస్తూ దానవీర శూర కర్ణ, శ్రీకృష్ణ పాండవీయం వంటి సినిమాల్లో అన్నగారు అనేక ప్రయోగాత్మక సీన్స్ ని పెట్టారు.
వస్తున్న కథలు, చేస్తున్న పాత్రలు అందరికి తెలిసినవే కాబట్టి విన్నూతంగా అలోచించి కొత్తదనం జోడించాలని ఎన్టీఆర్ ఎప్పుడు ఆలోచించేవారట.జనాలను సినిమా థియేటర్ కి ఆకర్షించాలంటే అంతే ఆకర్షణీయమైన సినిమాలను వారి ముందు పెట్టాలని పరితపించేవారు.
అందుకోసం అయన ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలను చేసేవారట.అందులో ఏమైనా కొత్త సన్నివేశం కనిపిస్తే అది తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకునేవారు.సినిమాలు చూస్తూ ఎప్పుడు బిజీ గా ఉండే ఎన్టీఆర్ కి సమయం చాల తక్కువగా ఉండేది అందులోను మైథాలజీ సినిమాలను ఎక్కువగా చూసేవారు.అందుకే అన్నగారు తన సినిమాల్లో ప్రయోగాలు చేసి తనదైన ముద్రను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెక్కు చెదరని సినిమాలను అందించారు.
ఇక్క ఎన్టీఆర్ చేస్తున్న ప్రయోగాలను మించి స్థానికత ప్రయోగాలతో విటలాచార్య సినిమాలు ఉండేవి.