కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఇప్పుడు తెలుగులో ఫాలోయింగ్ కోసం ట్రై చేస్తున్నాడు.తమిళ్ లో స్టార్ హీరోల లిష్టులో టాప్ లో ఉన్న ఈయన తెలుగు మార్కెట్ పై కన్నేశాడు.
దీంతో తెలుగు డైరెక్టర్ ను లైన్లో పెట్టి తెలుగు సినిమాను చేస్తున్నాడు.ప్రెజెంట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.
తమిళ్ లో ‘వరిసు‘ తెలుగులో ‘వారసుడు‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో విజయ్ తెలుగులో గ్రాండ్ గా లాంచ్ అవ్వడానికి ప్లానింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి అప్డేట్ కావాలని అందరు అడుగు తున్నారు.మరికొద్ది రోజుల్లో రాబోయే దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్నట్టు టాక్.
ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రెడీ చేస్తున్నారట.దీంతో ఈ పండుగ విజయ్ ఫ్యాన్స్ కు మరింత ప్రత్యేకం అవ్వడం ఖాయం.అయితే విజయ్ తన సినిమాల్లో ఒక్క పాట అయినా పాడడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది.

మరి ఇప్పుడు కూడా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.థమన్ కూడా ఈ సినిమాకు సాలిడ్ హిట్ నెంబర్ అందించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించ నున్నట్టు తెలుస్తుంది.
మరి ఈ సినిమా విజయ్ కు తెలుగులో ఎలాంటి మార్కెట్ తెచ్చిపెడుతుందో చూడాలి.సంక్రాంతికి ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.