Prabhas: ప్రభాస్ చేసిన ఫస్ట్ యాడ్ ఇదే.. ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మామూలుగా పెద్ద పెద్ద స్టార్ హీరో హీరోయిన్లు యాడ్స్ లలో చేయటానికి ఇష్టపడరు.కారణం ప్రజలు.

 Pan India Hero Prabhas Remuneration For First Ad Video Goes Viral On Social Med-TeluguStop.com

ఎందుకంటే వాళ్లకు ప్రోడక్ట్ అవసరం అవుతుందా లేదా.అది మంచి ప్రోడక్టా లేదా అనేది ప్రజలకు చాలా అవసరం.

అది వాళ్లకు అనవసరమైనది అయితే.ముఖ్యంగా దానివల్ల అనారోగ్య సమస్యలు లేదా ఇతర నష్టపోయే సమస్యలు ఉంటే అసలు చేయడానికి ఇష్టపడరు.

అందుకే ఏదైనా యాడ్ చేయాలి అంటే ముందుగా ఆ ప్రోడక్ట్ గురించి బాగా లోతుగా తెలుసుకున్న తర్వాతే కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు.

అందుకే చాలామంది స్టార్ హీరోలు పెద్ద పెద్ద వాటిని యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటారు.

ఇప్పటికే మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా పలువురు స్టార్ హీరోలు రకరకాల బ్రాండ్లను ప్రమోట్ చేశారు.అంతేకాకుండా భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు.

అయితే ఇప్పటివరకు ఏ యాడ్స్ లలో కనిపించని ప్రభాస్( Prabhas ) కూడా రీసెంట్ గా ఒక యాడ్ చేశాడు.ఇక ఆ యాడ్ కి ఆయన ఎంత తీసుకున్నాడు అనేది బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇంతకూ ఆయన ఎంత తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.పెద్ద పెద్ద సినిమాలకు సైన్ చేస్తూ బాగా బిజీగా మారాడు.అప్పటివరకు రెబల్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ కు బాహుబలి సినిమా( Bahubali ) లైఫ్ టర్న్ చేసిందని చెప్పాలి.

అలా బాహుబలి సీరిస్ తో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేశాడు.కానీ ఎందుకో ఆ సినిమాలు అంత టాక్ తెచ్చుకోలేకపోయాయి.

అయినా కూడా స్టార్ దర్శకులు ఆయనకు అవకాశాలు ఇవ్వడానికి అస్సలు వెనకాడటం లేదు.ఒక సినిమా చేస్తూనే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు.అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లను తన సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో( Adipurush Movie ) బిజీగా ఉండగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రావటంతో ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచుకున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే.

ఎన్నడు లేనటువంటి విధంగా ప్రభాస్ యాడ్స్ లలో కూడా కనిపించడానికి సిద్ధమయ్యాడు.రీసెంట్గా తను మహీంద్రా కారుకు( Mahindra Car ) సంబంధించిన యాడ్ చేశాడు.

అచ్చం సినిమా స్టైల్ లాగా అనిపించింది ఆ యాడ్.పైగా ప్రభాస్ అందులో చూడటానికి చాలా అందంగా, హ్యాండ్సమ్ గా కనిపించాడు.ఇక ఆ యాడ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలలో బాగా వైరల్ అవుతుంది.అయితే ఈ యాడ్ కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషకం ఎంత అంటే.

జీరో అని చెప్పాలి.అవును మీరు విన్నది నిజమే.

అంత పెద్ద స్టంట్ తో ఉన్న యాడ్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఈ యాడ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిసింది.దీంతో ఈ యాడ్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకోమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ప్రభాస్ నో అన్నాడని తెలిసింది.

దీంతో ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఫీదా అవుతున్నారు.గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube