తన కుమారుడికి అగ్రశ్రేణి సంస్థలో సీటు ఇప్పించేందుకు గాను నకిలీ పత్రాలను సృష్టించడంతో పాటు ఫోర్జరీ చేసిన కేసులో యూకేకు చెందిన భారత సంతతి మహిళపై అభియోగాలు మోపారు.వివరాల్లోకి వెళితే.
నిందితురాలిని 38 ఏళ్ల భక్తి షాగా( Bhakti sha ) గుర్తించారు.ఈమె నార్త్ లండన్‌లోని మిల్ హిల్ కౌంటీ హైస్కూల్ ( Mill Hill County High School )క్యాచ్‌మెంట్ ఏరియాలో వున్నందున ఎడ్గ్‌వేర్‌లోని వృద్ధ దంపతుల ఇల్లు తనదేనంటూ పేర్కొంది.
ఎడ్గ్‌వేర్.మిల్ హిల్ నుంచి 1.1 మైళ్ల దూరంలో వుంది.హెండన్‌లోని షా ఇల్లు.స్కూల్ నుంచి దాదాపు 3.4 మైళ్ల దూరంలో వుంది.అయితే మిల్ హిల్‌కు 1.3 మైళ్లలోపు నివసించే వారికి కేవలం 158 ప్లేస్‌మెంట్స్‌ను మాత్రమే సదరు పాఠశాల కేటాయిస్తుంది.
ఈ క్రమంలో వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇల్లు తనదేనని పేర్కొనేందుకు గాను నిందితురాలు పన్ను ఖాతాలను, నకిలీ ఒప్పందాలను, రెంట్ అగ్రిమెంట్‌ను రూపొందించినట్లు కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా విల్లెస్‌డెన్ మేజిస్ట్రేట్స్ కోర్ట్ తెలిపింది.అయితే పత్రాల్లో వున్న వ్యత్యాసాలను గుర్తించిన కౌన్సిల్ వర్కర్లు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వృద్ధ దంపతుల ఇంటి వెనుక తన మాజీ భాగస్వామి కొనుగోలు చేసిన భూమిలో ఇంటిని నిర్మించబోతున్నానని చెబుతూ ఆమె స్కూల్ ప్లేస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు డైలీ మెయిల్ తెలిపింది.కానీ బార్నెట్ కౌన్సిల్ అడ్మిషన్స్ టీమ్ ఆమె దరఖాస్తును తిరస్కరించింది.
ఇందులో ఆమె ప్రస్తుత చిరునామా పేర్కొన్నట్లు తెలిపింది.దీంతో షా.తెలివిగా మొత్తం స్టోరీని మార్చేసింది.తాము కొనుగోలు చేసిన ఆస్తికి పక్కనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారని , కానీ వారిని తాను ఎన్నడూ కలవలేదని చెప్పింది.
ఇదే సమయంలో పన్ను కట్టేందుకు వెళ్లినప్పుడు అంతకుముందే బిల్లు కట్టినట్లుగా వుండటం చూసి వృద్ధ దంపతులు ఆశ్చర్యపోయారు.

భక్తి షా వద్ద.వాటర్, కౌన్సిల్ ట్యాక్స్ అకౌంట్‌లు వున్నాయి.ఆమె కన్వేయన్సర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి నకిలీ వాటర్ బిల్లును తయారు చేసింది.
దానితో పాటు నకిలీ సేల్ డీడ్, ల్యాండ్ రిజిస్ట్రీ ఫామ్‌ను సృష్టించింది.అయితే వృద్ధ దంపతులు గత పదేళ్లుగా అక్కడే నివసిస్తున్నారని , వారు అక్కడి నుంచి వెళ్లే ఉద్దేశం లేదని కోర్టు విచారణలో తేలింది.
తాను ఇల్లు మారినట్లు కౌన్సిల్ విశ్వసించకపోడంతో హెండన్‌లోని తన సొంతింటిని మరొకరికి అద్దెకు ఇస్తున్నట్లు భక్తి షా ఫేక్ రెంట్ అగ్రిమెంట్‌ను సృష్టించింది.నిజానికి ఆమె కూడా ఆ ఇంటిలో అద్దెకే వుంటోంది.

ఒకవేళ కౌన్సిల్ ఈ పత్రాలకు ఆమోదముద్ర వేసుంటే , కౌన్సిల్ వర్కర్స్ ( Council workers )పత్రాల్లోని వ్యత్యాసాలను గుర్తించకుండా వుండి వుంటే భక్తి షా కుమారుడు మిల్ హిల్ కౌంటీ స్కూల్‌లో చోటు సంపాదించేవాడు.ఆమె కొడుకు ప్రస్తుతం ఫీజు చెల్లించే పాఠశాలలో చదువుకుంటున్నాడు.మరో సంస్థలో చేరేందుకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్‌లో అతను విఫలమవ్వడంతో భక్తి షా ఈ కుట్రకు తెరదీసింది.ఈ నేరంపై జిల్లా జడ్జి లొరైన్ మెక్ డొనాగ్ స్పందిస్తూ.
శిక్ష నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.అలాగే నిందితురాలిని షరతులు లేని బెయిల్‌పై వుంచారు.







