ఇటీవల కాలంలో చాలా మంది ఫ్యాషన్ పేరుతో హెయిర్ కలరింగ్ ( Hair coloring )లేదా హెయిర్ డైయింగ్ చేయించుకుంటున్నారు.కొందరు తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు, మరికొందరు స్టైల్ మరియు కొత్త లుక్ కోసం హెయిర్ కలరింగ్ చేయించుకుంటూ ప్రతి నెలా భారీగా ఖర్చు పెడుతుంటారు.
అయితే హెయిర్ కలరింగ్ వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా రసాయనాలున్న డైలు వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హెయిర్ డైలో ఉండే కెమికల్స్ వల్ల జుట్టులో సహజంగా ఉండే తేమ తగ్గిపోతుంది.ఫలితంగా జుట్టు పొడి పొడిగా మారిపోవడం, విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.అలాగే తరచూ కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు దాని సహజమైన రంగును కోల్పోతుంది.దాంతో చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారే అవకాశం ఉంటుంది.

హెయిర్ డైలోని కెమికల్స్ జుట్టు కుదుళ్లను బలహీనంగా మారుస్తాయి.ఫలితంగా హెయిర్ లాస్ ( Hair loss )ఎక్కువవుతుంది.జుట్టు పల్చగా మారిపోతుంది.అమోనియా ఉన్న డైలు వాడితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.హెయిర్ డైలోని రసాయనాలు తలలో అలర్జీకి కారణం అవ్వొచ్చు.దాంతో రాషెస్, దద్దుర్లు, దురద ( Rashes, hives, itching )వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.

అంతేకాదు తరచూ హెయిర్ కలరింగ్ చేయించుకోవడం వల్ల హార్మోనల్ అసమతుల్యత( Hormonal imbalance ) ఏర్పడుతుంది.తలనొప్పి, ఒంట్లో హీట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు.ఒకవేళ హెయిర్ కలరింగ్ చేసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలంటే అమోనియా-ఫ్రీ, కెమికల్-ఫ్రీ కలర్స్ వాడండి.హెన్నా, ఇండిగో వంటివి ఆ కోవకే చెందుతాయి.అలాగే తరచుగా కలర్ చేయకుండా కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఇవ్వండి.హెయిర్ కలరింగ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
తద్వారా అలర్జీ ఉందా లేదో తెలుసుకోవచ్చు.ఇక జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి న్యాచురల్ డైలు లేదా హర్బల్ కలర్స్ ఉపయోగించటం మంచి ఎంపిక అవుతుంది.