సాధారణంగా హెయిర్ ఫాల్ అనేది కొందరిలో చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.రెగ్యులర్ గా తలస్నానం చేయడం, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, చుండ్రు, హార్మోన్ల అసమతుల్యత, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి.
దాంతో హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ తప్పి ఎంతగానో మదన పెడుతుంటుంది.ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలీక.
ఎలా జుట్టు రాలడాన్ని ఆపాలో అర్థం కాక ఒత్తిడికి లోనవుతారు.మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఎంత తీవ్రమైన హెయిర్ ఫాల్ అయినా అదుపులోకి తెచ్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శీకాకాయ పౌడర్ మరియు అర కప్పు వాటర్ ను పోసుకుని బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకుని అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకొని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ లోకి వస్తుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా కూడా పెరుగుతుంది.