తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటి సౌందర్య ( Soundarya )… తన కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికి కొంతమందితో చేసిన సినిమాలు ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.ఇక సీనియర్ హీరోలందరితో ఆమెకు మంచి ర్యాపో ఉండడంతో ఎవరి పక్కన అయినా సరే హీరోయిన్ గా ఆమె చాలా బాగా సెట్ అయ్యేది.
మొత్తానికైతే స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆమె ప్రస్తుతం మన మధ్య లేకపోవడం అనేది కొంతవరకు బాధాకరమైన విషయమనే చెప్పాలి.ఈమె హీరోయిన్ గా పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ లను సాధిస్తున్న మహేష్ బాబు ( Mahesh Babu ) పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం అయితే వచ్చింది.
వైవిఎస్ చౌదరి ( YVS Choudary ) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన యువరాజు ( Yuvaraju ) సినిమాలో సిమ్రాన్ ( Simran ) పోషించిన పాత్ర కోసం మొదటి సౌందర్య ను అడిగారట.
కానీ మహేష్ బాబు తో తను చేస్తే తనకు అక్కలా ఉంటానని భార్య లా మాత్రం కనిపించనని తను చెప్పడంతో దర్శకుడు ఆమె ను పక్కన పెట్టి సిమ్రాన్ ని ఆ పాత్ర కోసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఆమె తీసుకున్న నిర్ణయంలో క్లారిటీ అయితే ఉంది.నిజానికి మహేష్ బాబు అప్పుడు చాలా చిన్నపిల్లాడిలా కనిపించేవాడు.అప్పటికే సౌందర్య స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక దానికి తోడుగా స్టార్ హీరోల పక్కన సినిమాల్లో నటించింది కాబట్టి ఆమె ఏజ్ ఎక్కువగానే ఉంటుందని ప్రతి ఒక్క అభిమాని కూడా అలాంటి క్యారెక్టర్ లోనే తనని ఊహించుకుంటారు తప్ప మహేష్ బాబు లాంటి ఒక యంగ్ కుర్రాడికి లవర్ పాత్రలో తనని ఊహించుకునే సాహసం అయితే చేయలేరు.అందువల్లే ఆమె తనకు బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతోనే ఆ సినిమా నుంచి తప్పుకున్నారు…

మొత్తానికైతే మహేష్ బాబు లాంటి నటి సౌందర్యతో నటించాలని తనకు ఉందని కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు.ఈ రకంగా అతనికి అవకాశం వచ్చినప్పటికి అది కార్య రూపం దాల్చకపోవడంతో మహేష్ బాబు కొంతవరకు బాధపడ్డట్టుగా కూడా ఒక సందర్భంలో తెలియజేశాడు.మొత్తానికైతే అప్పుడు స్టార్ హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన సౌందర్య ను రీప్లేస్ చేసే నటీమణులు ఇప్పటివరకు ఇండస్ట్రీకి దొరకలేదనే చెప్పాలి…