గ్రాస్, షేర్, నెట్ .. ఈ తేడాలేంటి? సినిమా బిజినెస్ పూర్తి వివరాలు

ఒకప్పుడు సినిమా ఎన్నిరోజులు ఆడింది? ఎన్ని సెంటర్లలో 50,100 రోజులు జరుపుకుంది .ఈ అంశాల మీద సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసేవారు.

కాని ఇప్పుడు అలా కాదు.సినిమా కలెక్షన్లని ట్రాకింగ్ చేయడం సులువైన పనిగా మారింది.

 Gross, Nett, Share .. Cinema Business Details You Should Know-Gross, Nett, Share .. Cinema Business Details You Should Know-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతీ సినిమా యొక్క కలెక్షన్ల రిపోర్టు బయటకి వస్తోంది.లెక్కల విషయంలో నిర్మాతలు అవకతవకలకి పాల్పడినా తెలిసిపోతుంది.

ట్రాకింగ్ వ్యవస్థ అంత బలంగా మారింది మరి.కాని, ఇప్పటికీ సినిమా కలెక్షన్ల మీద పూర్తి అవగాహన ఉండట్లేదు జనాలకి.సినిమా నిర్మాతలు వందకోట్లు వచ్చాయి అని ప్రకటిస్తే, గ్రాస్, నెట్, షేర్ కి మధ్య తేడా తెలీకుండా, ఒక సినిమా ఎంత సంపాదించింది అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.ఈ తేడా తెలియకే, ఒక్కోసారి తెలుగుస్టాప్ రిపోర్టు చేస్తున్న కలెక్షన్లని కూడా సింపుల్ గా ఫేక్ అనేస్తున్నారు.

ఈ యుగంలో కూడా సినిమా బిజినెస్ మీద అవగాహన లేకపోతే ఎలా? అందుకే సినిమా బిజినెస్ కి సంబంధించి అయిదు ముఖ్యమైన విషయాల్ని మీకు చెబుతున్నాం .షేర్, గ్రాస్, నెట్ మధ్య తేడా మీకు చెబుతున్నాం .పేజిలు తిప్పుతూ బాక్సాఫీస్ లెక్కల మీద జ్ఞానాన్ని పెంచుకోండి.

* సొంత విడుదల / పంపిణీదారులు

సినిమాని రెండురకాలుగా విడుదల చేసుకుంటారు.

ఒకటి సొంతంగా విడుదల చేసుకోవడం లేదంటే పంపిణీదారులకి అమ్మేయడం.బాలివుడ్ లో ఎక్కువగా సొంత విడుదల ఉంటుంది.

అంటే సినిమాని ఎవరికి అమ్మరు.నిర్మాతలే సొంతంగా థియేటర్లలో విడుదల చేసుకోని, థియేటర్ కిరాయి కట్టుకుంటారు.

సినిమాకి లాభం వచ్చినా, నష్టం వచ్చినా పూర్తి బాధ్యత వారిదే.ఇలా ఎందుకు చేస్తారంటే, బాలివుడ్ నిర్మాతల పెట్టుబడి సాటిలైట్ హక్కులు రూపంలోనే దాదాపుగా తిరిగి వచ్చేస్తుంది.

సేఫ్ జోన్ లో ఉన్న నిర్మాత రిస్క్ చేస్తాడు.

ఇక టాలివుడ్ 99% సినిమాని పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్స్) కి అమ్మేస్తారు.

ఒక నిర్మాత 50 కోట్లతో సినిమాని నిర్మిస్తే, దాన్ని కనీసం 60 కోట్లకి అమ్మడానికి ప్రయత్నిస్తాడు.హీరో మార్కేట్ ని బట్టి సినిమా బిజినెస్ స్థాయి పెరుగుతుంది.

రాజమౌళి, చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల సినిమాలు 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తాయి.

ఒక్కో ఏరియాలో ఒక్కో పంపిణీదారుడు సినిమాని ఆ ఏరియాలో హీరో మార్కేట్ ని బట్టి కొనుక్కుంటాడు.

ఈ బిజినెస్ డీల్స్ లో పలురకాలు ఉంటాయి.ఔట్ రయిట్, షేర్ గ్యారంటి, రికవరీబుల్ .ఇలా రకరకాలుగా ఉంటాయి.డీల్ ని బట్టి నిర్మాతకి, పంపిణిదారుడికి మధ్య లాభాల శాతం డిసైడ్ చేస్తారు.

* గ్రాస్ :

Gross/గ్రాస్ అంటే సినిమా టికేట్లు అమ్మగా వచ్చిన మొత్తం.ఒక సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది గ్రాస్ ని బట్టే డిసైడ్ చేయాలి నిజానికి.

హాలివుడ్ సినిమాలకి గ్రాస్ కలెక్షన్లనే చెబుతారు.ఇక గ్రాస్ లెక్కని చెప్పాలంటే, ఒక థియేటర్ ఫుల్ అయితే, అన్ని టికేట్లకి కలిపి లక్ష రూపాయలు వస్తాయనుకోండి .దాన్నే గ్రాస్ అని అంటారు.అంటే టికేట్ల అమ్మకంపై వచ్చిన మొత్తం గ్రాస్.

ఇప్పుడు ఖైదీ నం 150 సాధించిన 160 కోట్లు, శ్రీమంతుడు 150 కోట్లు, బాహుబలి 600 కోట్లు .ఇవన్ని గ్రాస్ లెక్కలే.ఇందులోంచి ఎలాంటి ట్యాక్స్ ఎమౌంట్ కాని, థీయేటర్ ఖర్చులు కాని తీయలేదు.

* నెట్

Nett/నెట్ అంటే గ్రాస్ లోంచి ట్యాక్స్ తీయగా మిగిలిన ఎమౌంట్.చివరి పేజిలో చెప్పిన ఉదాహరణ ప్రకారం, ఒక థియేటర్లో ఒక షో టికేట్స్ అన్ని అమ్మగా, లక్ష రూపాయలు వస్తే, దాంట్లోంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన వినోదపు పన్ను/ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ మైనస్ చేయగా మిలిగిన మొత్తం.అంటే 1,00,000 రూపాయల గ్రాస్ మీద తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ విధిస్తున్న 15% పన్నుని తీసేస్తే .1,00,000 – 15,000 = 85,000 .అంటే ఆ షో నెట్ 85,000 రూపాయలు అన్నమాట.బాలివుడ్ లో నెట్ కలెక్షన్లు రిపోర్టు చేస్తారు.గ్రాస్ కూడా చెబుతారు కాని, షేర్ ప్రకటించేది తక్కువే.

* షేర్

Share/ షేర్ అంటే, గ్రాస్ లోంచి అన్ని ఖర్చులు తీసేసిన తరువాత పంచుకోవడానికి నిర్మాత – డిస్ట్రిబ్యూటర్స్ కి మిగిలేది.అంటే గ్రాస్ లోంచి ట్యాక్స్ తీసేస్తే నెట్ అవుతుంది కదా, ఆ నెట్ లోంచి థీయేటర్ ఖర్చులు కూడా తీసేస్తే, మిగిలిన దాన్నే షేర్ అని అంటారు.

ఈ షేర్ ని లెక్కపెట్టడానికి ఒకే ఫిక్స్ వాల్యు లేదు.ఇది ఏరియాని బట్టి, థీయేటర్ కెపాసిటీ, లొకేషన్ ని బట్టి మారుతూ ఉంటుంది.

ఏ నిర్మాత/పంపిణిదారుడు చాకచక్యంగా తమకు లాభపడే థీయేటర్లను పట్టుకుంటాడో, వారే ఎక్కువ షేర్ ని రాబడతారు.ఉదాహరణకు, శ్రీమంతుడు సాధించిన దాదాపు 150 కోట్ల గ్రాస్ కి షేర్ 86 కోట్ల దాకా ఉంటే, ఖైదీనం 150 సాధించిన 164 కోట్ల గ్రాస్ కి ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ వచ్చింది.

ఇక్కడే అల్లు అరవింద్ పనితనం తెలిసేది.

ఇక షేర్ ని ఎలా పంచుకుంటారు, అసలు పంచుకుంటారా లేదా, ఈ విషయం నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్ కి మధ్య జరిగిన డీల్ ని బట్టి ఉంటుంది.

* సినిమా ఫలితం :

సినిమా ఫలితం, అంటే సినిమా హిట్ ఆ, ఫ్లాపా, యావరేజ్ ఆ, డిజాస్టర్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ .ఈ ఫలితాలు సినిమా మొత్తం సంపాదించిన గ్రాస్ మీద ఆధారపడి ఉండదు.షేర్ మీదే ఉంటుంది.బయ్యర్లు సినిమా మీద పెట్టిన మొత్తం మీద మొత్తం ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది.దీన్నే ROI – Return on investment అని అంటారు.ఉదాహారణకు చెప్పాలంటే శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ కాని ఖైదీ నం 150 కేవలం హిట్, బ్లాక్ బస్టర్ కాదు.

ఎలా అని మీరు అడగవచ్చు.శ్రీమంతుడు మీద బయ్యర్లు 60 కోట్ల దాకా పెడితే, 86 కోట్ల షేర్ వచ్చింది.

అంటే 26 కోట్ల లాభం .అదే ఖైదీనం 150 మీద 90 కోట్లు పెడితే 103 కోట్లు వచ్చాయి (అందులోనూ నైజంలో నష్టాలు) .అంటే లాభాలు శ్రీమంతుడిలో సగం.సినిమా ఫలితాన్ని వచ్చిన కలెక్షన్లు బట్టి కాదు, పెట్టుబడి మీద వచ్చిన మొత్తాన్ని బట్టి డిసైడ్ చేస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు