MIM పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో అల్లర్లు సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు చేశారు.
మహమ్మద్ ప్రవక్త పై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.ఇందువల్లే పాత బస్తీలో అల్లర్లు, నిరసనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో మరోసారి రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ఆయనపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి పార్టీ ఆయనను సస్పెండ్ చేయడం మాత్రమే కాదు పది రోజుల లోపు వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది.
ఈలోగా పాత కేసుల నేపథ్యంలో రెండోసారి రాజాసింగ్ నీ ఈరోజు ఉదయం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఉప ఎన్నికల కోసమే ఏ రీతిగా బిజెపి వ్యవహరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే అవకాశాలు ఉన్నాయని అసదుద్దీన్ ఓవేసి సోషల్ మీడియాలో తనదైన శైలిలో బీజేపీపై సీరియస్ కామెంట్స్ చేశారు.